వేములవాడలో శివదీక్షల జోరు..
Vemulavada: తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. శివస్వాముల ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయ మార్మోగింది. అభిషేక మండపంలో అర్చకులు నందగిరి శంకరయ్య గురు స్వాములు తమ్మల సంతోష్, వాసాలమర్రి గోపి అధ్వర్వంలో దాదాపు 300 మంది భక్తులు శివదీక్షలు స్వీకరించారు. నుదుటన, విభూతి కుంకుమ ధరించిన శివ స్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల ధారణ వేశారు. ప్రతి యేటా శివరాత్రి ముందు శివుడి మలధారణ చేసి, శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు. అలాగే అర్దమండల దీక్షలు ఈనెల 26న శివ భక్తులు దీక్షలు చేపట్టనున్నారు.