కొండగట్టుకు రూ.100 కోట్లు.. జీవో జారీ
Kondagattu: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి వందకోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వంద కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి పనుల జాబితా పంపించాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని బహిరంగ సభలో ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బుధవారం ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.