డ్రోన్ ద్వారా వేలాల జాతర పర్యవేక్షణ
Manchiryal: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రామ్నాథ్ స్పష్టం చేశారు. వేలాల జాతరలో ఆయన శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జైపూర్ ఏసీపీ జి.నరేందర్ తో కలిసి డ్రోన్ ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు సౌకర్యాలు అందించడంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పార్కింగ్ ప్రదేశాలు, బాతింగ్ ఘాట్లు, గుట్టపై ఆలయ ప్రదేశాలు, ఆలయాన్ని డ్రోన్ ద్వారా పర్యవేక్షించారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి 50 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని శ్రీరాంపూర్ సిఐ బి.రాజు, జైపూర్ ఎస్సై కె.రామకృష్ణను ఆదేశించారు.