అనాథలు, పేదలకు సేవ చెయ్యండి
నేతలు, కార్యకర్తలను కోరిన రేవంత్ రెడ్డి - పుట్టినరోజు తాను అందుబాటులో ఉండటం లేదని వెల్లడి
తన పుట్టినరోజు సోమవారం సందర్భంగా తాను నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంతరెడ్డి స్పష్టం చేశారు.తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం వెళ్తున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అనాథలు, పేదలకు తోచిన విధంగా సేవ చెయ్యాలని కోరారు. తనను వ్యక్తిగతంగా కలసిన దానికంటే అలా చేయడం ఎక్కువ తృప్తి ఇస్తుందని పేర్కొన్నారు.