టైట్ ఫైట్ లో ఆస్ట్రేలియా విక్టరీ
T20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సంచలన విజయం నమోదు చేసింది. పాకిస్థాన్ పై అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసుకుని.. ఫైనల్స్ లో చోటు సాధించింది.
తొలుత బ్యాటింగ్ కు దిగి 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధించింది పాకిస్థాన్ జట్టు. తర్వాత.. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఓ దశలో చేతులెత్తేసినట్టే కనిపించింది. 96 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ.. మార్కస్ స్టోయిన్స్, మాథ్యూ వేడ్ జట్టు బాధ్యత ముందుకు తీసుకుపోయారు.
ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా.. లక్ష్యాన్ని ముగించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టుకు అనూహ్యమైన విజయాన్ని అందించారు. మార్కస్ 40.. మాథ్యూ వేడ్ 41 పరుగులు చేశారు. కేవలం 17 బాల్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూ.. పాక్ కు విజయాన్ని దూరం చేశాడు. ఆసీస్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.