నిధులు మంజూరు చేయండి
మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావును కలిసిన విప్ బాల్క సుమన్
Balka Suman: చెన్నూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న 7 బ్రిడ్జ్ లకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. ఈ మేరకు ఆయన మంత్రి ప్రశాంత్ రెడ్డి, R&B ENC రవీందర్ రావుని కలిశారు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం, టేకుమట్ల బ్రిడ్జికి రూ.10 కోట్లు, కుందారం బ్రిడ్జికి రూ.4 కోట్లు, కిష్టాపూర్ వద్ద నిర్మించే బ్రిడ్జ్‌కి రూ.4 కోట్లు, కోటపల్లి మండలంలోని లింగన్నపేట బ్రిడ్జికు రూ.4 కోట్లు, మందమర్రి మండలం పొన్నారం బ్రిడ్జికు రూ.5.50 కోట్లు, చిర్రకుంట వద్ద నిర్మించే బ్రిడ్జ్ కు రూ.2 కోట్లు, భీమారం మండలం నర్సింగాపూర్ వద్ద నిర్మించే బ్రిడ్జ్ కు రూ.2.50 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం మొత్తం ఏడు బ్రిడ్జ్ ల నిర్మాణాలకు సంబంధించి రూ.32 కోట్ల నిధులు మంజూరు చేయాలని విప్ బాల్క సుమన్ మంత్రిని కోరారు.