కొత్త మంత్రులకు శాఖలివే..
Telangana: తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉదయం శాఖలను కేటాయించింది. మంత్రులకు శాఖల కేటాయింపు జరిగినట్లు ప్రచారం జరిగినా.. అదేం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రమాణం చేసిన మూడో రోజుల తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించింది. గతంలో మీడియాలో, సోషల్ మీడియాలో జరిగిన శాఖలు కాకుండా ఇప్పుడు అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు.
భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
ఉత్తంకుమార్ రెడ్డి – నీటి పారుదల పౌర సరఫరాలు
దామోదర రాజనర్సింహ – వైద్యారోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – ఆర్ అండ్ బి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవిన్యూ , ఆర్ అండ్ బీ గృహ నిర్మాణం
పొన్నం ప్రభాకర్ – రవాణా బీసీ సంక్షేమం
కొండా సురేఖ – అటవీ, ప్రయాణ, దేవాలయ
సీతక్క – పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమం
తుమ్మల – వ్యవసాయ, చేనేత
శ్రీధర్ బాబు – ఐటీ ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
జూపల్లి – ఎక్సైజ్, పర్యాటకశాఖ