బడుగ పండగ సందడి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బడుగ పండగ సందడి నెలకొంది. పొలాల అమావాస్య మరుసటి రోజు ఈ పండగ చేసుకుంటారు. ఆయా గ్రామాల్లోని సమీపవాగుల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య రోజు నవధాన్యాలతో తయారుచేసిన గౌరమ్మలను మరుసటిరోజు ఉదయం వాగుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పండగ ఘనంగా నిర్వహించారు. ఆది వాసీ గూడాల్లో గిరిజన తండాల్లో సంప్రదాయ బద్దంగా ఈ బడుగ పండగను నిర్వహించారు. పొలాల పండగ మరుసటి రోజున దోమలు, అంటు వ్యాధులు, క్రిమికీటకాలు అన్నిటితో విముక్తి పొందాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొలాల అమావాస్య రోజున నిష్ఠతో పూజించే రెైతులు, ఆదివాసీలు బడుగ రోజు మాంసాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం వరకు శ్రావణం కావడం, మంగళవారం పండగ కావడంతో మటన్, చికెన్ షాపులు జనంతో కిటకిటలాడాయి.