సెప్టెంబర్ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్..

Telangana : సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. నిజాం నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. ఈ సెప్టెంబర్ 17 ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఈ రోజు ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటుంది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలో మిగతా 32 జిల్లాల్లో కూడా మంత్రులు జెండాలు ఎగురవేసి.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జరపనున్నారు.

జిల్లాల్లో జెండా ఎగ‌ర‌వేసేది వీరే…

1.ఆదిలాబాద్ – షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు(SC, ST, OBC, మైనారిటీ సంక్షేమం)

2.భద్రాద్రి కొత్తగూడెం-తుమ్మల నాగేశ్వర రావు, వ్యవసాయ శాఖ మంత్రి

3.హన్మకొండ -కొండా సురేఖ, పర్యావరణ & అటవీ, దేవాదాయ శాఖ మంత్రి

4.జగిత్యాల – ఎ. లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్

5.జయశంకర్ భూపాలపల్లి – పోడెం వీరయ్య, ఛైర్మన్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్,

6.జనగాం – బీర్ల ఇల్లయ్య, ప్రభుత్వం విప్

7.జోగులాంబ గద్వాల్- ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు)

8.కామారెడ్డి – పటేల్ రమేష్ రెడ్డి, ఛైర్మన్ తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్

9.కరీంనగర్ – డి.శ్రీధర్ బాబు, ఐటీ మంత్రి

10.ఖమ్మం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

11.కుమురంభీమ్ ఆసిఫాబాద్-బండ ప్రకాష్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్

12.మహబూబాబాద్ – జె.రాంచందర్ నాయక్,ప్రభుత్వం విప్

13.మహబూబ్ నగర్ – జూపల్లి కృష్ణరావు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మంత్రి

14.మంచిర్యాల – వేణుగోపాలరావు, ప్రభుత్వ సలహాదారు

15.మెదక్ – కె. కేశవ రావు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)

16. మేడ్చల్ – పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ

17. ములుగు – మంత్రి సీతక్క

18. నాగర్‌కర్నూల్ – జి.చిన్నారెడ్డి వైస్-ఛైర్మన్, ప్లానింగ్ బోర్డ్

19.నల్గొండ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

20. నారాయణపేట – గురునాథ్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్

21. నిర్మల్ – రాజయ్య, సిరిసిల్లా చైర్‌పర్సన్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్

22. నిజామాబాద్ – అనిల్ ఎరావతి, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్

23. పెద్దపల్లి – నేరెళ్ల శారద, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్

24. రాజన్న సిరిసిల్ల – ఆది శ్రీనివాస్, ప్రభుత్వం విప్

25. రంగారెడ్డి – వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు

26. సంగారెడ్డి – మంత్రి దామోదర రాజనరసింహ

27. సిద్దిపేట – మంత్రి పొన్నం ప్రభాకర్

28. సూర్యాపేట – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

29. వికారాబాద్ – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

30. వనపర్తి – ప్రీతమ్, చైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్

31. వరంగల్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

32. యాదాద్రి భువనగిరి – గుత్తా సుఖేందర్ రెడ్డి గౌరవ చైర్మన్, TSLC

Get real time updates directly on you device, subscribe now.

You might also like