యువ కార్మికులు శ్రమశక్తి చాటితే సింగరేణికి ఉజ్వల భవిష్యత్

ప్రజాపాలన దినోత్సవంలో సీఎండీ lఎన్.బలరామ్

సింగరేణిలో ప్రస్తుతం 50 శాతం కన్నా ఎక్కువ మంది యువత విధులు నిర్వర్తిస్తున్నారని ఈ యువకులు సంఘటితంగా తమ శ్రమశక్తి చాటితే కంపెనీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీఎండీ బలరామ్ అన్నారు. సింగరేణి భవన్ లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో కంపెనీ 60 వేల టర్నోవర్ సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి వ్యాపార విస్తరణ దిశగా వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. రాజస్థాన్ లో సోలార్ పవర్ ప్లాంట్, సింగరేణిలో మూసివేసిన ఉపరితల గనుల్లో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, ఎస్టీపీపీలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ , ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాక్కు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణం, రాష్ట్రంలో 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ తదితర అనేక వినూత్న ప్రాజెక్టులతో సింగరేణి ఉజ్వల భవితకు పునాదులు వేస్తున్నట్లు తెలిపారు.

అయితే సంస్థ అభివృద్ధికి, ఈ ప్రాంత యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పనలో కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకుల తోడ్పాటు అత్యవసరమన్నారు. సమష్టిగా లక్ష్య సాధనకు కృషి చేస్తే దేశంలోనే అగ్రగామి సంస్థగా సింగరేణిని ఉన్నత స్థాయిలో నిలపడం సాధ్యమవుతుందన్నారు.
సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఉద్యోగులంతా పనిచేయాలన్నారు. పోటీ మార్కెట్ లో నిలదొక్కుకోవాలంటే నాణ్యత, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీఎం (కో ఆర్డినేషన్) ఎస్.డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) డి.రవి ప్రసాద్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like