సింగరేణి కార్మికులకు 33 శాతం వాటా

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించారు. 2023-24లో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని, ఇందులో కార్మికులకు రూ.796 కోట్లు బోనస్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.90లక్షలు బోనస్ రానుందని తెలిపారు. ఒప్పంద ఉద్యోగులకు సైతం ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త అందించింది. రూ.4,701 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ లో రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు పంచుతున్నాం. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి లక్షా 90వేలు బోనస్ ఇస్తున్నాం. కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.6 వేలు ఇస్తాం. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వడం ఇదే మొదటి సారి. గత ఏడాది కంటే 20 వేలు అధికంగా బోనస్ ఇచ్చాం. సింగరేణి లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులకు బోనస్ గా అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు సైతం తమ వంతు పాత్ర పోషించారు’ అని వ్యాఖ్యానించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like