రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు
Telangana Gurukula Schools: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు వాటి యజమానులు తాళాలు వేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ఈ పాఠశాలలకు ప్రభుత్వం తొమ్మిది నెలలుగా కిరాయి చెల్లించడం లేదు. దీనికి నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు భవనాల యజమానులు తాళాలు వేశారు. దీంతో దసరా సెలవుల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయట పడిగాపులు కాస్తున్నారు. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్‌నగర్, భువనగిరిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలకు భవనాల యజమానులు తాళాలు వేశారు. వెంటనే బకాయిలన్నింటినీ చెల్లించాలని రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవనయాజమాన్య సంఘం డిమాండ్ చేసింది.