ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులు
ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా గుస్సాడీ దండారి సంబరాలు ఎంతో దోహదపడతాయని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం రాముగూడెంలో దండారి ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ రాబోయే తరాలకు సాంప్రదాయాలు తెలిసేవిధంగా గుస్సాడీ దండారి ఉత్సవాలు ఎంతో కీలకమన్నారు. ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకులని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో ఇమ్రాన్ ఖాన్, MPDO శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి శాలిగామ బానయ్య, తాండూర్ ఏఈ విష్ణు, మాజీ ఉపసర్పంచ్ మడవి పరపతిరావు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్, పెద్దబోయిన మల్లేష్, ఇందూరి సత్యనారాయణ, మడావి పర్పత్రావు, అమృతరావు, తిరుపతి, భగవంత రావు గిరిజన నాయకులు పాల్గొన్నారు