రేవంత్‌రెడ్డి వాహనం తనిఖీ చేసిన పోలీసులు
Police checked Revanth Reddy’s vehicle : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆయన మహారాష్ట్రలోని చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో మహారాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అన్నివాహనాలకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి చంద్ర పూర్ లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గంగా వెళ్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు సీఎం వాహనాన్ని చేశారు.
అనంతరం చంద్రాపూర్ నియోజకవర్గం గుగ్గూస్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసిందని… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని పేర్కొన్నారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు. ఈ దేశంలో గుజరాత్ సహా ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని వివరించారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్ నాథ్ శిండే… అజిత్ పవార్ కాలరాశారని ఆగ్రహించారు. ఏక్ నాథ్ శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని తెలిపారు. చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించండని కోరారు.