మీడియా పై పోలీసుల ఆంక్షలు
Police restrictions on media: కొమురంభీం జిల్లాలో మీడియాపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని శైలజ ఘటన విషయంలో పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. విద్యార్ధిని స్వగ్రామం వెళ్లకుండా పది కిలో మీటర్ల దూరంలో మీడియాను ఆపేశారు. చర్చలు జరుగుతున్నాయని, అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.