ఎస్ఐ ఆత్మహత్య
-సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని మృతి
-యువతితో కలిసి గది తీసుకున్న ఎస్ఐ
-ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం
SI suicide: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతొంది.
ఎస్ఐ నిన్న రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. రిసార్ట్స్ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. దీంతో సోమవారం ఉదయం వాజేడు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్న తర్వాత రిసార్ట్స్ సిబ్బంది డోర్ పగులగొట్టి చూడగా ఎస్ఐ విగతజీవిగా పడి ఉన్నారు. నిన్న ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. గతంలో పేరూరు ఎస్‌ఐగా హరీశ్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్ఫార్మర్స్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని చంపేశారు. అక్కడి నుంచి బదిలీపై వాజేడుకు వచ్చిన ఎస్‌ఐ సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎస్సై హరీష్ రాత్రి 9 గంటల సమయంలో ఓ యువతితో కలిసి రిసార్ట్స్ కు వెళ్లారు. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి ఎస్సైతో పాటే ఆ గదిలో ఉంది.. ఎస్ఐ గన్ తో కాల్చుకున్న తర్వాత.. ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.. ఇంతకీ ఆ యువతి ఎవరు..? అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామం..