మహిళా కానిస్టేబుల్ హత్య
Murder of a woman constable:హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే దారి కాచి హత్య చేశాడు. నాగమణి కోసం దారి కాచిన తమ్ముడు పరమేష్ కారుతో ఢీకొట్టి కత్తితో నరికి దారుణంగా చంపాడు. పరమేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నాగమణి నెలరోజుల కిందట ప్రేమ వివాహం చేసుకుంది.. కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేని తమ్ముడు పరమేష్ సొంత అక్కనే హత్య చేశాడు. 2020 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నాగమణి, శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ రాయపోల్ ప్రాంతానికి చెందిన వారే. శ్రీకాంత్ నాగమణి నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్ నగర్ లో నాగమణి శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో సొంత గ్రామానికి వెళ్ళిన నాగమణి ఉదయాన్నే స్కూటీపై పోలీస్ స్టేషన్ బయలుదేరింది. ఈ క్రమంలో నాగమణిని వెంబడించిన తమ్ముడు పరమేశ్ మొదట కార్ తో ఢీ కొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు..
అక్క నాగమణిని హత్య చేసిన తర్వాత పోలీసుల వద్దకు వెళ్లి పరమేష్ లొంగిపోయాడు.. మొదటి భర్తతో విడిపోయిన నాగమణి శ్రీకాంత్ ను రెండవ వివాహం చేసుకుంది. నాగమణికి సోదరుడు పరమేష్ ఒక్కడే.. తల్లితండ్రులు లేరు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ప్లేటు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దవాఖానకు తరలించారు.