ఉద్యోగాలను క్రమబద్దీకరించే వరకు ఉద్యమం

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి

సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దిండిగల్ యాదగిరి స్పష్టం చేశారు. 17 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుం దెబ్బ ) మద్దతుతో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగుల శ్రమ దోపిడీకి, వివక్షకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో దీక్ష శిబిరాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే సచివాలయానికి సగౌరవంగా ఉద్యోగులను పిలిచి సర్వీస్‌ క్రమబద్ధీకరించడం పాటు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పార‌ని ఇప్పుడు ఆ విష‌యాన్ని విస్మరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19వేల ఉద్యోగులు 17 రోజులుగా సమ్మె చేస్తున్నారని.. సీఎం ఇకనైనా స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా విద్య వ్యవస్థ కుంటుపడిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీ సీఎం నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటానికి తమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు పెందుర్ దాదేరావ్, మహిళా సంఘం అధ్యక్షురాలు రేణుక, నేతలు మనోజ్, చిత్రం ఇందిరాబాయి, లలితాబాయి, భారతి తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, అధ్యక్షురాలు ప్రియాంక, కార్యదర్శి ధరంసింగ్, దీప్తి, శ్రీకాంత్, కేశవ్, ప్రశాంత్ రెడ్డి, ప్రకాష్, దేవద‌ర్శన్, మమత, సురేందర్, వెంకటి, పార్థసారథి,భోజన్న,రాకేష్, సందీప్, సోమన్న, చిరంజీవి పాల్గొన్నారు. ముత్నూరులో కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి 5 కి.మీ అమరవీల స్తూపం వరకు కాలినడకన పాదయాత్ర నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు నినాదాలతో హోరెత్తిస్తూ ముందుకు సాగారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు.

👉

Get real time updates directly on you device, subscribe now.

You might also like