గిరిపోషణతో పౌష్టికాహార లోపం దూరం

గిరిజన మహిళలు, కిషోర బాలికలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం గిరిపోషణ కార్యక్రమం అమలు చేస్తోందని అంగన్వాడీ సూపర్వైజర్ మమత వెల్లడించారు. తాండూరు అబ్బాపూర్ లో సోమవారం గిరిపోషణ కార్యక్రమం అమలు పర్యవేక్షించి స్వయంగా వారికి వండిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు కొందరు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలతో పాటు గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి రోజూ ఉదయం అల్పాహారం కింద జొన్నలతో తయారు చేసిన పదార్థాలు, సాయంత్రం పల్లిపట్టి, చిరుధాన్యాలు, తీపి చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్ధాలు అందించాలని కోరారు.