పని చేస్తున్నా… ప్రచారం లేదు..
MLA Prem Sagar Rao: తాను ఎంతో పని చేస్తున్నా ప్రచారం ఉండటం లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు పత్రికలు, చానళ్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఏండ్లుగా నీళ్లు ఇవ్వని చోటికి నీళ్లిచ్చినా చిన్నగా రాశారని అన్నారు. మిగతా చోట్ల ఏ చిన్న పనైనా పెద్దగా రాస్తున్నారని స్పష్టం చేశారు. ఒక్క మంచిర్యాలలోనే ఈ విధంగా ఎందుకు ఉందో అర్ధం కావడం లేదన్నారు. కుంటు కుంటు వెళ్లిన చేసినా తగిన ప్రచారం కల్పించకపోవడం బాధ అనిపించిందంటూ మరోమారు స్పష్టం చేశారు. ఆ కనికరం, దయ కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు.