క్షమించండి
దర్శకుడు త్రినాథరావు హీరోయిన్ అన్షుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు చెబుతున్నా, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు.. తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా` అంటూ ఆ వీడియోలో చెప్పారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్గా మజాకా సినిమా రూపొందుతుంది. ఇందులో రావు రమేష్, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి త్రినాథరావు దర్శకుడు. బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్. ఈ మూవీ టీజర్ ఈవెంట్ ఆదివారం రోజు హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్లో దర్శకుడు త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మన్మథుడు ఫేమ్ అన్షు గురించి మాట్లాడుతూ ఆమె సన్నగా ఉందని, తెలుగు ఆడియెన్స్‌కి సైజులు కావాలని, తెలుగు వాళ్లకి సైజులు కావాలని తిని లావు అవ్వు అమ్మా అని చెప్పినట్టుగా మాట్లాడారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు త్రినాథరావుని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడు తాగి ఈవెంట్ కి వచ్చాడా? సక్సెస్ తలకెక్కిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది సోషల్ మీడియాలో నానా రచ్చ అవుతోందిది. తాజాగా దీన్ని మహిళా కమిషన్ కూడా సీరియస్‌గా తీసుకుంది. దీనిని సుమోటా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యింది.
దెబ్బకు దయ్యం దిగింది..
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మెన్ నేరేళ్ల శారదా స్పందిస్తూ, త్రినాథ రావు నక్కిన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరిస్తామని తెలిపారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణించబోతున్నామని వెల్లడించింది. ఇది ఇప్పుడు మరింత రచ్చ అవనుంది. మొత్తానికి దర్శకుడు నోటీ దూల అలా వివాదానికి కారణమైంది. మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో దర్శకుడికి దెబ్బకు దయ్యం దిగింది. దీంతో దిగొచ్చిన దర్శకుడు త్రినాథ రావు వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.