పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్

Bail for Padi Kaushik Reddy : హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)కి బెయిల్ లభించింది. మొత్తం.. మూడు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.

ఆదివారం కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay) మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం రసాభాసగా మారింది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశికెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఒక న్యూస్‌ చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సోమవారం రాత్రి తిరిగి వెళ్తుండగా.. ఆ చానల్‌ గేట్‌ ముందు మోహరించిన కరీంనగర్‌ పోలీసులు.. ఒక్కసారిగా పాడి కౌశిక్‌ రెడ్డిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్‌ త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లోనే మంగళవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వ‌హించారు. అనంతరం ఆయ‌న‌ను రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like