రోడ్డు ప్ర‌మాదం : గాయ‌ప‌డ్డ‌వారిలో ఇద్ద‌రు మృతి

Road Accident: రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిలో ఇద్ద‌రు మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) నార్నూర్ మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్ లో ఆదివారం ఐచర్ వాహనం బోల్తా పడి 47 మందికి గాయాలయిన విష‌యం తెలిసిందే. గుడిహత్నూర్ మండలం సూర్యగూడ కు చెందిన వారు జంగుబాయి జాత‌ర‌కు బ‌య‌ల్దేరారు. ఘాట్ రోడ్డు లోని మూలమలుపు వద్ద ఐచర్ వాహనం అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న 67 మంది ప్రయాణికుల్లో 47 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో గాయాల‌పాలైన కుమ్ర మల్కు (60) అర్ధ‌రాత్రి మ‌ర‌ణించ‌గా, తొడసం నాగుభాయి (70) ఈ రోజు ఉద‌యం చ‌నిపోయింది. బ్రేకులు ఫెయిల్ కావ‌డంతోనే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు బాధితులు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like