ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా గంగులూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది.

మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతున్నది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది వరకు మావోలు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తాజాగా జరిగిర ఎన్‌కౌంటర్‌లో మరో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. దండకారణ్యంలోకి కేంద్ర బలగాలు పెద్ద మొత్తంలో చొచ్చుకుపోయి.. మావోయిస్టుల శిబిరాల స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని మట్టుబెడతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like