15 రాష్ట్రాల్లో బీజేపీ పాగా

BJP has won in 15 states: ఢిల్లీలో బీజేపీ విజ‌యం ఆ పార్టీకి ఎన‌లేని ఆత్మ‌విశ్వాసాన్ని రెట్టింపు చేసిందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఎన్నో ఏండ్ల నిరీక్ష‌ణకు తెర‌ప‌డి కాషాయ పార్టీ విజ‌య దుంధుబి మోగించింది. ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల్లో ఎన్నో విజయాలు సాధించినా.. ఢిల్లీ పీఠం ద‌క్కించుకోవ‌డం, ఆ విజయం బీజేపీకి ఎంతో ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి.

దేశ‌వ్యాప్తంగా క‌మ‌లం ప్ర‌భ వెలిగిపోతోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ సంబురాలు సంబరాన‌ని అంటుతున్నాయి. ఆ పార్టీ ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వెళ్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి.. పదకొండేళ్లు గడుస్తున్నా.. బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది త‌ప్ప తగ్గ‌డం లేదు… అది ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు కూడా… ఢిల్లీ విజ‌యం కూడా ఆ పార్టీ ఖాతాలో పడడంతో బీజేపీ అధికారం 15 రాష్ట్రాలకు పెరిగింది. మిత్రప‌క్షాల‌తో కాకుండా భార‌తీయ జ‌న‌తా పార్టీ 15 రాష్ట్రాల్లో సత్తా చాటింది. ఎన్డీఏ కూడా కలుపుకుంటే మొత్తం 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఓడిపోవడంతో, దేశంలో భారత కూటమి ప్రభుత్వాల సంఖ్య ఎనిమిదికి పడిపోయింది — కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో మాత్ర‌మే అధికారానికి ప‌రిమితం అయ్యాయి.

ఈ విజయంతో, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఇప్పుడు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పరిపాలించనుంది. ఇప్పుడు ఢిల్లీతో సహా 15 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. 2024లో ప్ర‌ధాన‌మంత్రిగా మోడీ చారిత్రాత్మకంగా మూడవసారి వరుసగా అధికారంలోకి వచ్చారు, భారతదేశం యొక్క సుదీర్ఘకాలం పనిచేసిన నాయకులలో ఒకరిగా నిలిచారు. ఆయన నాయకత్వంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భ వెలిగిపోతోంది. బీజేపీ స్వ‌యంగా ప‌రిపాలించే రాష్ట్రాలు, ఆ పార్టీ కూట‌మి రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఎలాంటి పొర‌పొచ్చాలు లేకుండా ముందుకు సాగుతున్నాయి. నార్త్‌ఈస్ట్‌లో మిజోరం తప్ప అన్ని బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాలే. పుదుచ్చేరి కూడా ఎన్డీఏ ఖాతాలో ఉంది. అయితే దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాలకు నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయేతర పార్టీలే పాలిస్తున్నాయి.

BJP-NDA పాలిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితా
1. ఉత్తర ప్రదేశ్ (బిజెపి)
2. మహారాష్ట్ర (బిజెపి)
3. మధ్యప్రదేశ్ (బిజెపి)
4. గుజరాత్ (బిజెపి)
5. రాజస్థాన్ (బిజెపి)
6. ఒడిశా (బిజెపి)
7. అస్సాం (బిజెపి)
8. ఛత్తీస్‌గఢ్ (బిజెపి)
9. హర్యానా (బిజెపి)
10. ఢిల్లీ (బిజెపి)
11. ఉత్తరాఖండ్ (బిజెపి)
12. త్రిపుర (బిజెపి)
13. గోవా (బిజెపి)
14. అరుణాచల్ ప్రదేశ్ (బిజెపి)
15. మణిపూర్ (బిజెపి)

బీజేపీ మిత్రపక్షాలు:
16. ఆంధ్రప్రదేశ్ (TDP)
17. బీహార్ (JDU)
18. మేఘాలయ (NPP)
19. నాగాలాండ్ (NDPP)
20. సిక్కిం (SKM)
21. పుదుచ్చేరి (AINRC)

Get real time updates directly on you device, subscribe now.

You might also like