కొత్త మ‌ద్యం బ్రాండ్ల‌కు ఆహ్వానం

New Liquor Brands In Telangana : కొత్త లిక్కర్ బ్రాండ్ల‌కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రాష్ట్రంలో కొత్త లిక్క‌ర్ బ్రాండ్ల‌ను ఆహ్వానించేందుకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేర‌కు కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. అయితే ఆ కంపెనీలపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన బ్రాండ్లను నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం ప్రభుత్వం నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన అప్లికేషన్లను పది రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలని టీజీబీసీఎల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనుమతులపై కూడా నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇటీవల టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇచ్చింది. కానీ కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసింది.

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల ఆహ్వానానికి కొత్త విధానానికి ప్రభుత్వం నాంది పలికింది. కొత్త దరఖాస్తులను ఆహ్వానించే ముందు బహిరంగ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం టీజీబీసీఎల్​కు నిర్దేశించింది. టీజీబీసీఎల్ తెలంగాణలో రిజిస్టర్ కాని కొత్త సప్లయర్స్ నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రకటన జారీ చేసింది. కొత్త కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులను పది రోజులపాటు ఆన్​లైన్​లో పెట్టాలని టీజీబీసీఎల్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులపై వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరిపి అనంతరం అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది. టీజీబీసీఎల్​లో నమోదయ్యి సరఫరా చేస్తున్న సప్లయర్స్ మాత్రం ప్రస్తుతం ఉన్న పద్ధతిలోనే కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కొత్త మద్యం బ్రాండ్లపై నిర్ణయం తీసుకోనుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like