బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు
Early arrest of BRS leaders: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మూడు జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో ఆయన పర్యటన సాగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అయితే, ఆయన రాక సందర్భంగా మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కోటపల్లి మండల BRS నాయకులు, BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్, PACS చైర్మన్ సాంబ గౌడ్, కొట్టె నారాయణ, అక్కల మధుకర్, రాళ్లబండి స్వామి, కోటపల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షులు ఆసంపెల్లి సంపత్ కుమార్, బాపు నాయక్, కొట్రంగి మల్లేష్ లను ముందస్తు గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అదే విధంగా పలు చోట్ల సైతం బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం ఇలాంటి అప్రజాస్వామిక విధానం ఈ ప్రభుత్వం మానుకోవాలని BRS ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తూ శాడిస్ట్ పరిపాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలనను పక్కన పెట్టి అరెస్టుల పర్యం కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.