సింగ‌రేణి లారీకి ప్ర‌మాదం.. కార్మికుల‌కు గాయాలు

singareni: సింగ‌రేణికి చెందిన ఓ లారీకి ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో కార్మికుల‌కు గాయాల‌య్యాయి. సింగ‌రేణికి సంబంధించిన సామాగ్రి తెచ్చేందుకు కొత్త‌గూడెంకు అన్ని ఏరియాల నుంచి లారీలు వెళ‌తాయి. అక్క‌డి నుంచి సామాగ్రి లోడ్ చేసుకుని ఆయా ప్రాంతాల వ‌ర్క్‌షాపుల‌కు తీసుకువ‌స్తాయి. ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం మంద‌మ‌ర్రి ఏరియా వ‌ర్క్‌షాప్‌కు చెందిన లారీ (టీఎస్ 22 1077) కొత్త‌గూడెం బ‌య‌ల్దేరింది. ఆ లారీ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలో లారీకి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు సింగరేణి కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డ‌ట్లు తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like