ఎస్ఎల్బీసీకి చేరుకున్న సింగరేణి సీఎండీ
-ప్రమాదం జరిగినప్పటి నుంచి సహాయ చర్యల్లో సింగరేణి రెస్క్యూ సిబ్బంది
-రెస్క్యూ సిబ్బంది సేవలను ప్రశంసించిన సీఎండీ
-సహాయ చర్యలకు మరింత తోడ్పాటునిచ్చేందుకు మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది
Singareni:ఎస్ఎల్బీసీలో టన్నెల్ ప్రమాద ఘటన స్థలానికి సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఆరా తీశారు. భూగర్భంలో ప్రమాదాల సమయంలో సహాయ చర్యల్లో సుశిక్షితులైన సింగరేణి సిబ్బంది 100 మందికి పైగా పని చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర సహాయక సిబ్బందితో కలసి సమన్వయం అత్యాధునిక సహాయ సామగ్రితో సింగరేణి సిబ్బంది పని చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్లు క్షేమంగా రావాలని సీఎండీ ఎన్.బలరామ్ ఆకాంక్షించారు. అవసరమైతే మరింత మంది రెస్క్యూ సిబ్బందిని పంపించేందుకు సంసిద్ధమని ఆయన వెల్లడించారు.