త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌లు..

Gold Rate: ఐదు రోజులుగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. తులం బంగారం ధ‌ర ల‌క్ష దాటేందుకు ఉర‌క‌లు వేస్తూ ఉరుకుతున్న స‌మ‌యంలో స్వ‌ల్పంగానైనా త‌గ్గుతున్న ధ‌ర‌లతో సామాన్యులు కాస్త ఊర‌ట చెందుతున్నారు. దేశంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు, అంతర్జాతీయంగా మాత్రం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారంలో పెట్టుబడులకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు తులానికి దాదాపు 80 వేల రూపాయలకు దగ్గరలో ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.79,390గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,610గా ఉంది. ఢిల్లీలో బంగారం ధర రూ.10 తగ్గి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,540గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,760గా ఉంది ముంబైలో ఇవాళ ఉదయం 7 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.79,390గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,610గా ఉంది

వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో రూ.100 తగ్గుదల కనపడింది. హైద‌రాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,04,900, విజయవాడలో రూ.1,04,900, విశాఖలో రూ.1,04,900, ఢిల్లీలో రూ.96,900, ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.96,900గా ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like