రేపటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపూట

Anganwadi: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో శనివారం నుంచి అంగన్వాడి కేంద్రాలకు ఒంటి పూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలుజారీ చేశారు. మంత్రి సీతక్క ఆదేశాలతో పాఠశాలల తరహాలోనే అంగన్వాడీలకు రేపటి నుంచి ఒంటి పూట నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు అంగన్వాడి కేంద్రాలు నడుస్తాయి.
గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కేంద్రాలకు వచ్చిన ఆరేళ్లలోపు పిల్లలకు వడదెబ్బ తగలకుండా కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందు బాటులో ఉంచుకోవాలని తెలిపారు.