ఆదివాసీలకు అండగా ఉంటాం

-వారి సంక్షేమమే పోలీసుల ధ్యేయం
-మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్

Police: ఆదివాసీ కుటుంబాల సంక్షేమమే పోలీస్ ధ్యేయంగా వారికి అండగా ఉంటామని మంచిర్యాల డిసిపి భాస్కర్(Mancherial DCP Bhaskar) అన్నారు. నర్సాపూర్ (బెజ్జల)లో తాండూర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో “పోలీస్ మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్, స్లోమ్యాన్ సహకారంతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా త్రీ ఇంక్లైన్, ఫైవ్ ఇంక్లైన్, నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో 365 కుటుంబాలకి, ఒక్కొక్క కుటుంబంకి 5కిలోల బియ్యం, 5కిలోల గోధుమ పిండి, 2 కిలోల పప్పును అందచేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారన్నారు. వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు పోలీసు అనుసంధానంగా ఉంటూ వారికి విద్య, వైద్య సదుపాయాలు అందే విధంగా చేస్తున్నార‌ని చెప్పారు. వారు ముందుకు వెళ్లేలా కార్యక్రమం నిర్వహించిన‌ట్లు చెప్పారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగుపడ్డాయని తెలిపారు. గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీసులు ఎప్పుడు కృషి చేస్తారన్నారు.

గిరిజనుల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకుని కొన్ని సంఘవిద్రోహ‌శక్తులు ప్రలోభాలకు గురిచేసి చెడు మార్గాల వైపు ప్రోత్సహించేలా చేస్తారని డీసీపీ తెలిపారు. ప్రలోభాలకు లోను కాకుండా మంచిని ఎంచుకొని సమాజ శ్రేయస్సు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆదివాసి గిరిజనులతో కలిసి సహాపంక్తి భోజనాలు చేశారు. గత సంవత్సరం ఈ ప్రాంతం వారికి రాబిన్ హుడ్ ఆర్మీ 69 కుటుంబాలకి నిత్యవసర వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, మాదారం ఎస్సై సౌజన్య, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, కన్నెపల్లి ఎస్సై గంగారం భీమిలి ఎస్సై విజయ్ కుమార్, రాబిన్ హుడ్ ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like