అనుచిత వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం

Manchryala District: ద‌ళిత బిడ్డ, తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమిట‌ని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ(DCC President Kokkirala Surekha) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేసిన అనంత‌రం మాట్లాడారు. మొద‌టి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దళిత నేత‌లు అంటే చుల‌కన అంటూ దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ శాస‌న‌స‌భ స్పీకర్ గడ్డం ప్రసాద్(Telangana Assembly Speaker Gaddam Prasad)పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని స్పీకర్ కి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంత‌కు ముందు మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్య‌క్తం చేసి దిష్టిబొమ్మలు దహనం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like