నిర్మల్ లాడ్జిల్లో తనిఖీలు
Nirmal: నిర్మల్ జిల్లాలో పోలీసులు లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. నిర్మల్, భైంసా, బాసర పట్టణాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. వచ్చే వివరాలు, వారి ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా నమోదు చేస్తున్నారా…? లేదా…? వంటి వివరాలపై ఆరా తీశారు. రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను తనిఖీ చేస్తూ లాడ్జి నిర్వాహకులకు వచ్చిపోయే అతిథులకు సంబంధించి వారి ఆధార్ లో వివరాలు తప్పనిసరిగా ధృవీకరించాలని స్పష్టం చేశారు. లాడ్జీలకు సంబంధించిన లగ్జరీ బుక్స్ లో ప్రతిదీ క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా లాడ్జి యజమానులకు పనిచేసే సిబ్బందికి లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవర్ని ఉపేక్షించమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్పష్టం చేశారు.