గాజులు, చీర క‌ట్టుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు ఎక్కడ అక్రమాలు చేశారో….? ఎవరిని బెదిరించారో…? మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు(Former MLA Diwakar Rao) నిరూపించాలని లేకపోతే గాజులు, చీర కట్టుకుని ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నేత‌లు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao)పై అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు మాట్లాడారు. దివాకర్ రావు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను చీర, గాజులు ధరించి ఆయనకు క్షమాపణలు చెబుతానన్నారు. వయసు మీద పడడం, అధికారం లేకపోవడంతో దివాకర్ రావుకు మతిభ్రమించిందన్నారు. ఆయన తనయుడు విజిత్ రావు స్పందించి మంచి వైద్యం అందించాలని అందుకు ప్రేమ్ సాగర్ రావు కూడా సహకరిస్తారని చెప్పారు. నస్పూర్, టీఎన్జీవో కాలనీలో బీఆర్ఎస్‌ నేతలు భూములు కబ్జా చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. మళ్లీ టికెట్ రావడం.. గెలవడం.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం రావడం అనేది పగటి కలేనని వేణు తెలిపారు.

సర్కిల్ నిర్మించి ఉసురు తీసావు
మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి లక్ష్మీ టాకీస్ వరకు అనాలోచితంగా నిర్మించిన సర్కిళ్ళ వ‌ల్ల‌ 11 మంది ప్రాణాలు కోల్పోయార‌ని అందుకు దివాకర్ రావు కారణం కాదా…? అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ ప్ర‌శ్నించారు. సర్కిళ్ల ను కుదించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న ఎమ్మెల్యేపై కడుపుమండి తప్పుడు విమర్శలు చేయడం అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఉమర్ మియా కాలనీ భూ యజమానులు సుదీర్ఘ కాలం సమస్యను పరిష్కరించకుంటే ఎమ్మెల్యే పై నిందలు వేయడం ఏమిటన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో తై బజార్ లో అక్రమాలు జరిగితే మొత్తానికి రద్దు చేసి చిరు వ్యాపారులకు ఆర్ధిక వెసులుబాటు కల్పించి సొంత డబ్బులను మున్సిపాలిటీకి కట్టింది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కాదా…? అని ప్రశ్నించారు. మంచిర్యాలలో గుండాయిజం.. గంజాయిని పెంచింది నీవు.. నీ కుమారుడని జగమెరిగిన సత్యమ‌ని దివాక‌ర్ రావుపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. నా అంత శుద్ధపూస లేడని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే దివాకర్ రావు గ్రీన్ సిటీ వెంచర్ వాళ్ళను బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్ దగ్గర రూ. 30 లక్షలు వసూలు చేశాడని అన్నారు. నీ కుమారున్ని నక్సలైట్లు ఎందుకు హెచ్చరించారు…..?పెరుగన్నం ఎందుకు నిలిపి వేశారో..? ప్రజలకు దివాకర్ రావు జవాబు చెప్పాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like