ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా బుధవారం మాదారంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సభ్యుడు మందనపు రామారావు, కాంగ్రెస్ నేతలు సూరం దామోదర్ రెడ్డి, కాపర్తి సుభాష్, కుశ్నపెల్లి లక్ష్మణ్, గొర్లపల్లి బాణేష్, గోదెల కిషన్, తోట శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాస్, రాజా రామచందర్ పాల్గొన్నారు.