తోపుడు బండి… నీటి క‌ష్టాలండి…

నీటి క‌ష్టాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మిది.. నెల‌లో వారం రోజుల పాటు మంచినీటి కొర‌త‌… బోరింగ్‌ల వ‌ద్ద ప్ర‌జ‌ల క్యూ… నీళ్లు మోసుకుంటూ ప్ర‌జ‌లకు నానా ఇబ్బందులు… ఇదీ మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్ లో ప్ర‌జ‌ల నీటి క‌ష్టాలు. నీటి స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌డంతో తోపుడు బండిపై కొడుకు, త‌ల్లి క‌లిసి బోరింగ్ వ‌ద్ద నుంచి నీటిని తీసుకువెళ్తున్న దృశ్య‌మిది..

మాదారం టౌన్షిప్‌లో నిత్యం సింగ‌రేణి మోటార్లు చెడిపోవడంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఏడాదిగా ఇదే ప‌రిస్థితి. మోటార్లు పాడైపోవ‌డం వాటిని బాగుచేయించి తీసుకువ‌చ్చే వారం రోజుల త‌ర‌బ‌డి నీళ్లు రాక‌పోవ‌డం ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. అధికారులు చెడిపోయిన మోటార్లు బాగుచేయించ‌డంలో ఉన్న శ్ర‌ద్ధ కొత్త మోటార్లు తేవ‌డంలో చూప‌డం లేద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కొద్ది రోజుల కింద‌ట బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్‌ను క‌లిసిన సింగ‌రేణి జీఎం నీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. వెంట‌నే కొత్త మోటార్లు బిగించి నీటి ఎద్ద‌డి తొల‌గించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like