రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ టీచర్ మృతి

Road Accident: మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అంగన్‌వాడీ టీచర్ మృత్యువాతపడ్డారు. భూదేవి మందమర్రి 1లో అంగన్‌వాడీ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె యాపల్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో రహదారిపై నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో భూదేవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు రోడ్డు దాటేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నోమార్లు విజ్ఞప్తులు చేసినా నేషనల్ హైవే అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.