ఆన్‌లైన్ బుకింగ్ లేకుండానే అయ్యప్ప దర్శనం
శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేనివారికి కేరళలోని 10 చోట్ల స్పాట్ బుకింగ్ కేంద్రాలను టీడీబీ యాజమాన్యం ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి దర్శనం కోసం బుకింగ్ చేసుకోవచ్చు. ఆ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చు. మొత్తం పది ప్రాంతాల్లో ఈ స్పాట్ బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా బుఉక్ చేసుకుని హరిహరసుతుని దర్శనం చేసుకునే వీలుంటుంది.
స్పాట్ బుకింగ్ కేంద్రాలు ఇవే…
1. కొట్టారక్కర శ్రీ గణపతి దేవాలయం
2. ఎరిమెలి
3. నిలక్కల్
4. కుముళి చెక్‌పోస్ట్.
5. శ్రీ కండేశ్వర ఆలయం, తిరువనంతపురం.
6. ఎట్రుమనూరు శ్రీ మహాదేవర్ దేవాలయం.
7. వైక్కం శ్రీ మహాదేవర్ ఆలయం.
8. పందళం ప్యాలెస్‌లో ఉన్న శ్రీ వలియక్ ఆలయం
9. పెరుంబవూరు శ్రీ ధర్మశాస్తా ఆలయం.
10. కీలల్లం శ్రీ మహాదేవర్ ఆలయం.
దీని కోసం ఏమి అవసరం
1.ఆధార్ కార్డ్
2.కరోనా వ్యాక్సిన్ యొక్క రెండు మోతాదుల సర్టిఫికేట్.టీకాలు వేయకపోతే
3.ఆర్‌టీపీసీఆర్ కరోనా టెస్ట్ 72 గంటల ముందు తీసుకున్న ప్రతికూల ప్రమాణపత్రం.