అధిష్టానం అన్యాయం చేస్తే స‌హించం

MLA Kokkira Prem Sagar Rao: మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ప్రేం సాగర్ రావు హెచ్చరించారు. మంచిర్యాల‌లో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. మంత్రివర్గంలో త‌న‌కు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం చేసినట్టే అని ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకే అన్యాయం చేస్తారా..? అని ఈ సంద‌ర్భంగా ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా మాకిచ్చే గౌరవమని నిలదీశారు. ఇంద్రవెల్లి సభతో కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరి పోశానని ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా ఉన్నాన‌ని న‌న్ను క‌ష్ట‌పెట్ట‌వ‌ద్ద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like