హరీష్ రావు కంట కన్నీరు
Harish Rao: తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి చనిపోయాడని తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని చిన్నారిని ఓదార్చారు.
సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్‌లో ‘భద్రంగా ఉండాలి. భవిష్యత్‌లో ఎదగాలి’ అనే అంశంపై స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పాల్గొన్నారు. అవగాహన సదస్సులో తండ్రిని కోల్పోయి బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాలను విద్యార్థులు పంచుకున్నారు. తమ చదువు కోసం పేరెంట్స్ పడుతున్న కష్టాలను గుర్తించి, తాము తమ చదువు కోసం తపిస్తున్న పేరెంట్స్‌ను ఇబ్బంది పెడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రిని కోల్పోయి, బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని కంటతడి పెట్టుకుంటూ ఓ విద్యార్ధిని వెల్లడించింది. విద్యార్థిని వేదన విని హరీష్‌రావు కంటతడి పెట్టారు. ఆ విద్యార్థిని దగ్గరకు తీసుకుని హరీష్‌రావు ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు క్రమశిక్షణగా ఉండాలని, పేరెంట్స్‌ను ఇబ్బంది పెట్టొద్దని.. చక్కగా చదువుకోవాలని కోరారు. డిసిప్లిన్ ముఖ్యమని ఈ విషయాన్ని ఎన్నడూ మరువద్దన్నారు.టీచర్లను గౌరవించాలని కోరారు. ఈ విషయంపై తనకు ప్రామిస్ చేయాలని హరీశ్ రావు కోరారు.