ఆ నరరూప రాక్షసుడు వీడే
Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. బైసరన్ లోయలో జరిగిన ఈ దాడిలో 30 మందికి పైగా మరణించారు. వీరిలో ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడికి లష్కర్‌తో అనుబంధంగా ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) బాధ్యత తీసుకుంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడికి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడిగా చెప్పబడుతున్న లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరిగా తెలుస్తోంది.
అసలు సూత్రధారి..
కాశ్మీర్ యాత్రికులపై ఘాతుక చర్యకు పాల్పడింది కీలక వ్యక్తి లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్.. ఇతన్ని సైఫుల్లా కసూరి అని కూడా పిలుస్తారు. జట్, అలీ, హబీబుల్లా నౌమాన్ వంటి అనేక పేర్లతో కూడా చలామణి అవుతున్నాడు. ఇతను లష్కరే తోయిబాకు కీలక కమాండర్. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవాడు. సైఫుల్లా కసూరి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు అత్యంత విశ్వసనీయ సహాయకుడు. అతని వయస్సు 40-45 ఏళ్ల మధ్య ఉంటుందని, అతను రెండు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని భావిస్తున్నారు.
ఎన్నో దాడుల్లో హస్తం..
భారతదేశంలో జరిగే అనేక పెద్ద ఉగ్రవాద దాడుల్లో అతని హస్తం ఉన్నట్లు సమాచారం. అతను ఎల్లప్పుడూ లగ్జరీ కార్లలో ప్రయాణిస్తాడు. లష్కరే ఉగ్రవాదులు ఎల్లప్పుడూ తన భద్రత కోసం అల్ట్రా-ఆధునిక ఆయుధాలను వెంట ఉంచుకుంటారు. పాకిస్తాన్ సైన్యంలోని సైనికులను ప్రేరేపించడానికి పనిచేస్తాడు కాబట్టి, ఆర్మీ అధికారులకు కూడా వీడంటే అభిమానం. తాజా ఉగ్రవాద దాడికి కేవలం రెండు నెలల ముందు, సైపుల్లా ఖలీద్ పాకిస్థాన్ పంజాబ్లోని కంగన్‌పూర్ చేరుకున్నాడు. అక్కడ పాకిస్థాన్ బెటాలియన్ ఉంది. పాకిస్థానీ ఆర్మీ కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్… జిహాదీ ప్రసంగం చేయడానికి వీడిని ఆహ్వానించాడు. ఈ సైపుల్లా ఖలీద్ అక్కడికి చేరుకోగానే పాక్ కల్నల్ స్వయంగా అతనిపై పూల వర్షం కురిపించాడు. వీడి ప్రసంగం పాకిస్థాన్ సైన్యాన్ని తీవ్రంగా రెచ్చగొట్టింది. భారతీయ సైనికులను ఎంత ఎక్కువగా చంపితే, అల్లాహ్ వారికి అంత ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడని వాడు ప్రసంగంలో చెప్పాడట.
కాశ్మీర్ విముక్తి పొందుతుంది..
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన సమావేశంలో వాడు భారతదేశంపై విషం కక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. “ఈ రోజు ఫిబ్రవరి 2, 2025.. నేను హామీ ఇస్తున్నాను. ఫిబ్రవరి 2, 2026 నాటికి కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి మేం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. రాబోయే రోజుల్లో, మన ముజాహిదీన్ దాడులను తీవ్రతరం చేస్తుంది. ఫిబ్రవరి 2, 2026 నాటికి కాశ్మీర్ విముక్తి పొందుతుందని ఆశిస్తున్నామషని అన్నాడు. సమావేశాన్ని ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యం సంయుక్తంగా నిర్వహించాయి. గత సంవత్సరం అబోటాబాద్ అడవులలో ఏర్పాటు చేసిన ఉగ్రవాద శిబిరంలో వందలాది మంది పాకిస్తాన్ బాలురు పాల్గొన్నారు. దీనిని లష్కరే తోయిబా రాజకీయ విభాగం పిఎంఎంఎల్. ఎస్ఎంఎల్ నిర్వహించాయి. సైఫుల్లా కసూరి కూడా అందులో ఉన్నాడు.
సరిహద్దుదాటి చొరబడ్డారు..
ఈ అబ్బాయిలకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన తర్వాత, వారు పాకిస్తాన్ సైన్యం సహాయంతో సరిహద్దు దాటి చొరబడ్డారని కూడా వెల్లడైంది. 2019 ఆగస్టు 5న, రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 మరియు 35A తొలగించబడ్డాయి. దీని తరువాత, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా మరియు జైష్-ఏ-మొహమ్మద్‌లను కవర్ చేయడానికి ISI TRF అంటే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ సైన్యం ఈ ఉగ్రవాద సంస్థకు సహాయం చేస్తుంది.