పదోన్నతితో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది
Ramagundam Police Commissioner Amber Kishore Jha :పదోన్నతి పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏ.ఎస్.ఐలుగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన సయ్యద్ మజారొద్దీన్, అబ్దుల్ మునీర్ అహ్మద్, ఏం.రాజన్న, ఆర్. బిక్ లాల్ లను అభినందించారు. ఈ సందర్భంగా వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నం అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.పదోన్నతి పొందిన పోలీస్ అధికారులతో మాట్లాడుతూ… పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని స్పష్టం చేశారు. పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచాలని స్పష్టం చేశారు. వీలైంత వరకు చట్ట పరిధిలో ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేయాలని, పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెరిగే రీతిలో ప్రజలతో వ్యవహరించాలని వెల్లడించారు.