రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిని కలిసిన సింగరేణి సీఎండీ
Singareni: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించిన కె.రామకృష్ణారావును సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ బుధవారం సాయంత్రం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కె.రామకృష్ణారావు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటూ సింగరేణి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒకరిగా సంస్థ అభివృద్ధికి ఎంతగానో సహకరించారని బలరామ్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.