మీరే చొరవ తీసుకోవాలి..
నితిన్ గడ్కరీకి మంత్రి సీతక్క విజ్ఞప్తి
ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా అని దళితులు, ఆదివాసులు ఎక్కువ మంది జీవిస్తున్న ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకవపోవడంతో పేదరికం ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీతక్క రోడ్ల అనుసందానం అభివృద్ధికి కీలకమన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా రోడ్ల అనుసంధానం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అటవీ అనుమతులు లేకపోవడంతో చాలా అటవీ ప్రాంత పల్లెలకు రోడ్ల కనెక్టివిటీలో జాప్యం జరుగుతోందని అందువల్ల వీటికి త్వరగా అనుమతులు వచ్చేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.