మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్ లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి విద్యాసంస్థలలో ప్రవేశాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు అవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మైనార్టీ గురుకులాలలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు. అర్హత గల మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ సమన్వయకర్త రిజ్వాన్, మంచిర్యాల కళాశాల, పాఠశాల ప్రిన్సిపల్ సంధ్య, చెన్నూర్, బెల్లంపల్లి ప్రిన్సిపాళ్ళు గోపి, సమ్మయ్య, నీలు అధికారులు పాల్గొన్నారు.