కేసీఅర్ చుట్టూ దయ్యాలు
Kalvakuntla Kavitha:కేసీఆర్‌కు తాను లేఖ రాసిన మాట వాస్తమేనని బీఆర్ర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని.. ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అమెరికా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. నేను కేసీఆర్‌కు లేఖ రాశాను. రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను. నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేశాను. కేసీఆర్‌కు రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియడం లేదు. కేసీఆర్ దేవుడు.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్‌కు నేను రాసిన లేఖ బయటకు వస్తే.. పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటీ. కేసీఆరే మా నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. లేఖ రాయడంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదని కవిత చెప్పుకొచ్చారు.
కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకుని అమెరికా నుంచి వచ్చేలోపు తాను రాసిన లేఖ లీక్ అయ్యిందన్నారు ఎమ్మెల్సీ కవిత. అది రెండు వారాల క్రితం రాసిన లేఖగా చెప్పారు. గతంలో కూడా తన అభిప్రాయాలను లేఖల ద్వారానే తండ్రి కేసీఆర్‌కు తెలియజేసేదానినని కవిత వివరించారు. అది తాను రెగ్యులర్‌గా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ అని చెప్పారు. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయాలను, ప్రజల స్పందనను మాత్రమే తాను లేఖలో పొందుపరిచినట్లు తెలిపారు.