ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్
ACB: రైతు వద్ద లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కడం తహసిల్దార్ కార్యాలయంలో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.7000 లంచం తీసుకుంటూ సర్వేయర్ ఉమాజీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు .
గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు ప్రభాకర్ నుంచి భూమి సర్వే చేసి ప్రొసిడీంగ్ కోసం సర్వేయర్ ఉమాజీ రూ.20,000 డిమాండ్ చేశాడు. రైతు ప్రభాకర్ ఇప్పటికే రూ.12 వేలు ముట్ట జెప్పాడు. మిగతా డబ్బులు రూ.7,000 ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.