ప్ర‌శ్నిస్తే కేసులా..?

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నార‌ని చెన్నూరు బీఆర్ఎస్ నేత‌, కౌన్సిలర్ రేవల్లి మహేష్ దుయ్య‌బట్టారు. కోర్టుకు హాజ‌రైన అనంత‌రం మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం అమ‌లు చేయాల‌ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు అక్రమంగా ఎనిమిది మంది నాయకులపై కేసులు బనాయించార‌ని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వాగ్దానాలను బేషరతుగా అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. అవి అమలు చేసేంత వరకు అడుగడుగునా నిల‌దీస్తామ‌న్నారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో కేసులు ఎదుర్కొన్నామ‌ని, వాటికి భ‌యపడకుండా తెలంగాణ సాధించేవరకు పోరాడామ‌ని అలాంటి ధైర్యం తమకుందని మ‌హేష్ స్ఫ‌ష్టం చేశారు. అక్రమ కేసుల వల్ల ఒరిగేది ఏమీ లేదన్నారు.

చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల మ‌ధ్య సఖ్యత లేద‌ని, వారంతా గ్రూపు తగాదాల్లో బిజీగా ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి పై దృష్టి సారించాలని వారికి హిత‌వు ప‌లికారు. కాంగ్రెస్ పార్టీలోని నేత‌లే త‌మ నేత‌ల‌పై భూ దందాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, బియ్యం మాఫియాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని మ‌హేష్ స్ప‌ష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో గాలిపెల్లి రవి, కమటం మనోహర్, నాయబ్, షేంషీర్ ఖాన్, రెవెల్లి రాజు, బోగే భారతి, సుద్దాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like