స‌వాల్‌.. ప్ర‌తి స‌వాల్‌..

Sirpur :సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మంగళవారం నవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్‌ను కోనేరు స్వీకరించారు. బుధ‌వారం ఉదయం 11 గంటలకు తుమ్మడి హెట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు, వారి అనుచరులు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే హరీష్ బాబు తుమ్మిడి హెట్టి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కోనప్ప, ఆయన అనుచరులను కూడా అడ్డుకున్నారు.

తుమ్మ‌డిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు సిద్ధిపేటకు తరలిపోతుంటే కోనేరు కోనప్ప చూస్తూ ఊరుకున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు ఆరోపణలు చేశారు. తుమ్మిడి హెట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించినా కోనప్ప మాట్లాడలేదని దుయ్య‌బ‌ట్టారు. కోనప్ప వల్లే సిర్పూరుకు అన్యాయం జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే విష‌యంలో మాజీ ఎమ్మెల్యే కోన‌ప్ప సైతం ఎమ్మెల్యేపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టవద్దని గతంలో ఎమ్మెల్యే హరీష్ తల్లి ధర్నాలు చేశారని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఇరువురు నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. తుమ్మ‌డిహెట్టి ప్రాజెక్టు వ‌ద్ద‌నే బ‌హిరంగ చ‌ర్చ పెడ‌తామంటూ ఇద్ద‌రూ రెడీ అయ్యారు. అయితే, చర్చకు వెళ్లకుండా ఇద్దరినీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కోనప్ప ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like